Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవిశాస్త్రి హద్దుమీరాడు: మంజ్రేకర్

టీమిండియా వెటరన్, ప్రస్తుత డైరెక్టర్ రవిశాస్త్రిపై వెటరన్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు సౌతాఫ్రికాపై పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను నిందించకుండా పిచ్ ను సరిగా తయారు చేయలేదంటూ క్యూరేటర్ సుధీర్ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'పిచ్ భలే తయారు చేశావు' అంటూ వ్యంగ్యంగా విమర్శలు ప్రారంభించిన రవిశాస్త్రి మరాఠాలో బూతులందుకున్నాడు. దీంతో పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ కూడా దీటుగా స్పందించాడు. తాను కూడా క్రికెటర్ నేనన్న విషయం మర్చిపోవద్దని తెలిపాడు. సఫారీలు చెలరేగిన చోట టీమిండియా ఆటగాళ్లు ఆడేందుకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నిస్తూనే, పిచ్ గురించి తనకు చెప్పవద్దని సూచించాడు. దీనిపై సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, సుధీర్ నాయక్ కూడా క్రికెట్ ఆడాడని రవిశాస్త్రి మర్చిపోయినట్టున్నాడని అన్నాడు. కనీసం సుధీర్ నాయక్ వయసుకు కూడా రవిశాస్త్రి గౌరవం ఇవ్వలేదని మంజ్రేకర్ ఆరోపించాడు. కాగా, రవిశాస్త్రిపై సుధీర్ నాయక్ ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి బీసీసీఐ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.

More Telugu News